video news : చంద్రయాన్‌-2 తర్వాత ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం పీఎస్‌ఎల్‌వీ సీ47

శ్రీహరికోట పీఎస్‌ఎల్‌వీ సీ47 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ దీనికి వేదికయ్యింది. పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ47 ప్రయోగానికి మంగళవారం ఉదయం 7.28 గంటలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఈ ప్రక్రియ 26 గంటలపాటు సాగింది.

First Published Nov 27, 2019, 3:33 PM IST | Last Updated Nov 27, 2019, 3:33 PM IST

శ్రీహరికోట పీఎస్‌ఎల్‌వీ సీ47 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ దీనికి వేదికయ్యింది. పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ47 ప్రయోగానికి మంగళవారం ఉదయం 7.28 గంటలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఈ ప్రక్రియ 26 గంటలపాటు సాగింది. 


చంద్రయాన్‌-2 తర్వాత ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగమిది. ఈ ప్రయోగం ద్వారా కార్టోశాట్‌-3తోపాటు  అమెరికాకు చెందిన 13 నానో ఉపగ్రహాలను కూడా నింగిలోకి పంపారు. మూడోతరం హైరెజల్యూషన్‌ ఎర్త్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహం కార్టోశాట్‌-3. దీని జీవిత కాలం ఐదేళ్లు.. బరువు సుమారు 1625 కిలోలు. పట్టణాభివృద్ధి ప్రణాళిక, గ్రామీణ వనరులకు సంబంధించిన సేవలను ఇది అందించనుంది. ఉగ్రవాద శిబిరాలను కార్టోశాట్‌-3 మరింత స్పష్టంగా తీయనుంది.