ప్రొద్దుటూరు మున్సిపల్ మీటింగ్ లో బాహాభాహీ... చెప్పులు విసురుకుంటూ తన్నుకున్న వైసిపి కౌన్సిలర్, వైస్ ఛైర్మన్

అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లాలో వైసిపి ప్రజానిధులు బాహాబాహీకి దిగారు.

First Published Mar 31, 2022, 2:27 PM IST | Last Updated Mar 31, 2022, 2:27 PM IST

అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లాలో వైసిపి ప్రజానిధులు బాహాబాహీకి దిగారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ సాధారణ సమావేశంలో వైసిపి కౌన్సిలర్ ఇర్ఫాన్ బాష, వైస్ ఛైర్మన్ ఖాజా మోహిద్దిన్ మద్య మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి చేరింది. ఇద్దరు నాయకులు సమావేశ మందిరంలోనే వీధిరౌడిల్లా గల్లాలు పట్టుకుని కొట్టుకున్నారు. ఒకరిపి ఒకరు చెప్పులు విసురుకున్నారు.  తాను ప్రాతినిధ్యం వహిస్తున్న 13వ వార్డులో ఎలాంటి అభివృద్ది పనులు జరగడం లేదని కౌన్సిలర్ ఇర్ఫాన్ ప్రశ్నించడమే ఈ గొడవకు దారితీసింది. కౌన్సిలర్ ను సర్దిచెప్పడానికి వైస్ ఛైర్మన్ మోహిద్దున్  ప్రయత్నించగా మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. వీరి గొడవతో సమావేశం రసాభఆసగా మారింది.