చెప్పుల్లేకుండా మండుటెండలో చిన్నారులను నిలబెట్టి... విశాఖలో ఓ టీచరమ్మ నిర్వాకమిదీ...

విశాఖపట్న : ఈ టెక్నాలజీ యుగంలో విద్యావ్యవస్థ పూర్తిగా మారిపోయింది... 

First Published Feb 23, 2023, 11:30 AM IST | Last Updated Feb 23, 2023, 11:29 AM IST

విశాఖపట్న : ఈ టెక్నాలజీ యుగంలో విద్యావ్యవస్థ పూర్తిగా మారిపోయింది... కానీ టీచర్లు మాత్రం మారనట్లు కనిపిస్తోంది. విద్యార్థులు కంప్యూటర్ల స్థాయికి చేరినా ఉపాధ్యాయులు మాత్రం క్రమశిక్షణ పేరుతో వెనకటి కాలం శిక్షలనే నమ్ముకుంటున్నారు. ఇలా విద్యార్థులను మండుటెండలో చెప్పులు లేకుండా రోడ్డుపై నిలబెట్టిందో విశాఖ టీచరమ్మ. విశాఖపట్నంలోని సీతమ్మధారలోని ఓ ప్రైవేట్ స్కూల్ బయట ఎండలో నిల్చున్న చిన్నారులను చూసి చలించిపోయిన ఓ వ్యక్తి ఇదేంటని టీచర్ ను ప్రశ్నించాడు. దీంతో అతడిపైనే అరుస్తూ టీచరమ్మ హంగామా సృష్టించింది. దీంతో అతడు చిన్నారుల అవస్థను వీడియోతీసి సోషల్ మీడియాలో పెట్టగా వైరల్ గా మారింది. చిన్నారులతో కర్కశంగా వ్యవహరించిన టీచర్ పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.