PRC Issue:కృష్ణా జిల్లా ఉద్రిక్తత... కలెక్టరేట్ ముట్టడికి ఉపాధ్యాయ సంఘాల యత్నం
మచిలీపట్నం: వైసిపి ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఇవాళ (గురువారం) కృష్ణా జిల్లాకు చెందిన ఉపాధ్యాయ సంఘాలు ఛలో కలెక్టరేట్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మచిలీపట్నంలోని కలెక్టరేట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేసారు. కలెక్టరేట్ నలువైపులా మర్గాలను బారికేడ్లతో మూసివేసారు. ఉపాధ్యాయ సంఘాలు, నాయకులు కలెక్టరేట్ వద్దకు భారీగా చేరుకోవడంతో పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. ఉపాధ్యాయుల నినాదాలతో కలెక్టరేట్ పరిసరాలు దద్దరిల్లాయి. ఉద్యోగుల నిరసనకు రైతు సంఘాలు మద్దతు పలికాయి. కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన ఉపాధ్యాయ సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషనుకు తరలించారు.