విశాఖలో ఉద్రిక్తత... చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయున్ని విశాఖపట్నంలో పోలీసులు అడ్డుకున్నారు. 

First Published May 5, 2022, 4:59 PM IST | Last Updated May 5, 2022, 4:59 PM IST

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయున్ని విశాఖపట్నంలో పోలీసులు అడ్డుకున్నారు. రుషికొండ హరిత రిసార్ట్స్‌కు వెళ్లేందుకు చంద్రబాబు ప్రయత్నించగా ఎండాడ జంక్షన్ వద్ద   పోలీసులు నిలిపివేసారు. హరిత రిసార్ట్స్‌లోని నిర్మాణాల పరిశీలనకు వెళుతుండగా జాతీయ రహదారిపైనే ఆయన వాహనశ్రేణిని పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు బృందం ఋషికొండకు వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, చంద్రబాబుకు మధ్య వాగ్వాదం జరిగింది.