హిందూపురంలో టిడిపి, వైసిపి ఘర్షణ... పరామర్శకు వెళ్లిన బాలకృష్ణను అడ్డుకున్న పోలీసులు

టిడిపి ఎమ్మెల్యే, సీనీహీరో నందమూరి బాలకృష్ణ శ్రీ సత్యసాయి జిల్లాలోని సొంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటించారు. 

First Published May 27, 2022, 12:42 PM IST | Last Updated May 27, 2022, 12:42 PM IST

టిడిపి ఎమ్మెల్యే, సీనీహీరో నందమూరి బాలకృష్ణ శ్రీ సత్యసాయి జిల్లాలోని సొంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటించారు. అయితే భారీ కాన్వాయ్ తో చిలమత్తూరు మండలం కొడికొండకు వెళుతున్న బాలయ్యను  పోలీసులు అడ్డుకున్నారు. మూడు రోజుల క్రితం జరిగిన కొడికొండ జాతర టీడీపీ-వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ  జరిగింది. ఇందులో గాయపడ్డ టీడీపీ నేతలను పరామర్శించేందుకు బాలయ్య వెళుతండగా అడ్డుకున్నారు. వెంటున్న వాహనాలను, టిడిపి నాయకులు, కార్యకర్తలను ఆపేసి కేవలం బాలక‌ృష్ణ వాహనాన్ని మాత్రమే గ్రామంలోకి అనుమతించారు పోలీసులు.