పోలీసులూ కళా పోషకులే... సంక్రాంతి సంబరాల్లో ఈ కాప్స్ మాస్ డ్యాన్స్ చూడండి...

మచిలీపట్నం : పోలీసులంటే ఎప్పుడు కఠినంగానే వుంటారని అందరూ భావిస్తుంటారు.

First Published Jan 11, 2023, 11:05 AM IST | Last Updated Jan 11, 2023, 11:05 AM IST

మచిలీపట్నం : పోలీసులంటే ఎప్పుడు కఠినంగానే వుంటారని అందరూ భావిస్తుంటారు. కానీ వారు కేవలం ఖాకీ డ్రెస్సు వేసి డ్యూటీలో వుంటేనే కటువుగా వుంటారని... ఒక్కసారి డ్యూటీ దిగి సంబరాల్లో మునిగినే వారేంత జాలీగా వుంటారో కృష్ణా జిల్లా పోలీసులు చూస్తే అర్థమవుతుంది. బొంబై పోదామ రాజా బొంబై పోదామా, నాది నక్కిలేసు గొలుసు అంటూ సాగే పాటలకు మాస్ స్టెప్పులేస్తూ పోలీసుల్లోనూ కళాపోషణ వుందని నిరూపించారు. కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా పోలీసుల్లో పనిఒత్తిడిని దూరంచేసేందుకు వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇటీవల జిల్లాలోని పోలీస్ కుటుంబాల కోసం క్రిస్మస్ సంబరాలు ఏర్పాటుచేయగా తాజాగా సంక్రాంతి సంబరాలు ఏర్పాటుచేసారు ఎస్పీ. అచ్చతెలుగు పల్లెటూరి వాతావరణంలో పోలీసులు పిల్లాపాపలతో కలిసివచ్చి ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కుటుంబాలు ఆటాపాటలతో హాయిగా గడిపారు. సంక్రాంతి సంబరాలను ఏర్పాటుచేసి కుటుంబం, స్నేహితులు, సహచర సిబ్బందితో సరదాగా గడిపేలా చేసిన జిల్లా ఎస్పీ జాషువాకు సిబ్బంది మొత్తం కృతజ్ఞతలు తెలిపారు.