పోలీసుల పేరిట టోకరా... నడికుడి రైల్వేస్టేషన్ లో రూ.89లక్షల ఛోరీ

దాచేపల్లి: ఎప్పుడూ రద్దీగా వుండే రైల్వేస్టేషన్లో వ్యాపారులను పోలీసుల పేరిట బురిడీ కొట్టించి ఏకంగా రూ.89లక్షలు దొంగిలించారు దోపిడీ దొంగలు. ఈ భారీ ఛోరీ గుంటూరు జిల్లా  దాచేపల్లి మండలంలోని నడికుడి రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది. దుర్గి మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులు వ్యాపారపనుల నిమిత్తం భారీగా డబ్బులు తీసుకుని  చెన్నైకి వెళుతున్నారు. రైల్లో వెళ్లాలని నిర్ణయించుకుని రూ.89లక్షలతో కూడిన రెండు బ్యాగులతో నడికుడి  రైల్వే జంక్షన్ కు చేరుకున్నారు. అయితే వీరివద్ద డబ్బున్న విషయాన్ని పసిగట్టిన దోపిడీ దొంగలు పోలీసులు పిలుస్తున్నారంటూ బురిడీ కొట్టించారు. నిజమేనని భావించి కాస్త పక్కకు వెళ్లగానే దొంగల  డబ్బుల బ్యాగులతో ఉడాయించారు. దీంతో లబోదిబోమన్న వ్యాపారులు రైల్వే పోలీసులకు పిర్యాదు చేసారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

First Published Mar 8, 2022, 9:59 AM IST | Last Updated Mar 8, 2022, 9:59 AM IST