దారుణం.. భర్త చనిపోయినా ముట్టుకోలేక.. విలవిల్లాడుతున్న భార్య...
కర్నూల్ జిల్లా ఆళ్ళగడ్డలో వీరభద్ర ట్రావెల్స్ ఓనర్ వీరభద్రుడు కరోనాతో చనిపోయాడు.
కర్నూల్ జిల్లా ఆళ్ళగడ్డలో వీరభద్ర ట్రావెల్స్ ఓనర్ వీరభద్రుడు కరోనాతో చనిపోయాడు. కొద్ది రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇంట్లోనే హోమ్ క్వారంటెన్ లో ఉన్నాడు. మొన్న ఒక్కసారిగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వీరభద్రుడు కోలుకోలేక మృతిచెందాడు. అయితే భర్త శవం కళ్లెదుటే ఉన్నా.. ముట్టుకోలేక, అంత్యక్రియలు నిర్వహించలేక ఆ భార్య గుండెలవిసేలా ఏడుస్తోంది. చివరికి వైద్యసిబ్బంది అక్కడికి చేరుకుని ఆమెకు పీపీఈ కిట్ అందించడంతో అది వేసుకుని భర్త శవాన్ని పట్టుకుని విపరీతంగా రోధించింది. ఈ సంఘటన చూసిన అందర్నీ కదిలించింది.