TDP formation day 2022: టిడిపికి ముందు... ఆ తర్వాత తెలుగువారి చరిత్ర: చంద్రబాబు

అమరావతి: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికాతో పాటు వివిధ దేశాల్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే టిడిపి కీలక నాయకులు ప్రవాస భారతీయులను ఉద్దేశించి జూమ్ యాప్ ద్వారా ప్రసంగించారు. ఇలా టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు కూడా ఎన్నారై టిడిపి శ్రేణులకు భవిష్యత్ లో పార్టీని తిరిగి అధికారంలో తీసుకురావడంతో పాటు ప్రజా సేవకు ముందుకురావాలంటూ దిశానిర్దేశం చేసారు. ''తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు పూర్తిచేసుకుని 41వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఆత్మగౌరవంతో ప్రారంభించబడిన పార్టీ ఆత్మవిశ్వాసంతో ప్రపంచమంతా తెలుగు జాతి ప్రతిభ చాటిచెబుతోంది.స్వర్గీయ ఎన్టీ రామారావు తెలుగుజాతి కోసం, మనకు జరుగుతున్న ఆన్యాయాన్ని చూసి రాజకీయాల్లోకి వచ్చారు. భవిష్యత్ తరాలు టిడిపికి ముందు... టిడిపి తర్వాత తెలుగువారి చరిత్ర అని చదువుకోవాల్సి వుంటుంది'' అని చంద్రబాబు పేర్కొన్నారు. 

First Published Mar 29, 2022, 12:32 PM IST | Last Updated Mar 29, 2022, 12:32 PM IST