విజయవాడ బిజెపి కార్యాలయంలో శృతిమించిన న్యూఇయర్ వేడుకలు... నాయకులతో మహిళల చిందులు

విజయవాడ: సాంప్రదాయాలకు విలువనిచ్చే పార్టీగా బిజెపికి మంచి పేరుంది. పాశ్చాత్య దేశాల మోజులో పడి దేశ సంస్కృతి సాంప్రదాయాలను నాశనం చేస్తున్నారంటూ ఇతర పార్టీలపై విరుచుకుపడే బిజెపిలోనే కొందరు నాయకుల ఆగడాలు శృతిమించుతున్నాయి. ఇలా ఏపీ బిజెపి నాయకుల న్యూఇయర్ వేడుకలు శృతిమించాయి. నూతన సంవత్సర వేడుకలు విజయవాడ బిజెపి కార్యాలయంలో వైభవంగా జరిగాయి. అయితే వేడుకలు కాస్త శృతిమించి పార్టీ నాయకులు ఆరేసుకోబోయి పారేసుకున్నాంటూ సినిమా పాటలపై చిందులేసారు. మహిళా నాయకులు పురుషులతో కలిసి పార్టీలోనే సినిమా పాటలపై చిందులేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బిజెపి కార్యాలయంలో జరిగిన ఈ  డాన్సులు వివాదాస్పదంగా మారాయి. 

First Published Jan 2, 2022, 1:13 PM IST | Last Updated Jan 2, 2022, 1:13 PM IST