Video : అమానుషం..అప్పుడే పుట్టిన శిశువును సజీవంగా పాతిపెట్టిన కసాయిలు...
విశాఖ ఏజెన్సీ, పాడేరు డివిజన్ వీసామామిడి గ్రామంలో ఓ తల్లి అప్పుడే పుట్టిన శిశువును సజీవంగా పాతిపెట్టింది.
విశాఖ ఏజెన్సీ, పాడేరు డివిజన్ వీసామామిడి గ్రామంలో ఓ తల్లి అప్పుడే పుట్టిన శిశువును సజీవంగా పాతిపెట్టింది. సాయంత్రం ఓ వ్యక్తి మూత్ర విసర్జనకు అటువైపు వెళ్లగా చిన్న పిల్ల ఏడుపు వినిపించింది. వెళ్ళిచూడగా ఓ శిశువుని పాతి పెట్టినట్టు గుర్తించి స్థానిక ఆశ కార్యకర్తకు, ఊర్లోని వాళ్లకు చెప్పాడు. ఆ శిశువుని పాడేరు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ శిశువు మృతి చెందింది.చికిత్స చేసిన వైద్యులు స్పందిస్తూ ఆ శిశువుని కాలుతో మెడపైన, గుండెపైన తొక్కి హత్య చేశారని ఇక్కడకు వచ్చిన తర్వాత చికిత్స అందించిన ఫలితం లేకపోయిందని అన్నారు.