Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో నేవీ డే సెలబ్రేషన్స్ ప్రారంభం... అమరవీరులకు నివాళి

 విశాఖపట్నం : భారత నౌకాదళ దినోత్సవ వేడుకలు విశాఖతీరంలో ప్రారంభమయ్యాయి. 

First Published Dec 4, 2022, 12:13 PM IST | Last Updated Dec 4, 2022, 12:13 PM IST

 విశాఖపట్నం : భారత నౌకాదళ దినోత్సవ వేడుకలు విశాఖతీరంలో ప్రారంభమయ్యాయి. విశాఖ సముద్ర తీరంలోని 1971 యుద్ద విజయ స్థూపం వద్ద అమర జవాన్లకు తూర్పు నావికాదళం నివాళి అర్పించింది. అమరజవాన్ జ్యోతి ముందు తూర్పు నావికాదళ ప్రధాన అధికారి వైస్ అడ్మిరల్  బిశ్వజిత్ దాస్ గుప్తా పుష్ఫగుచ్చం వుంచి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున రావు, నగర పోలీసు కమిషనర్ శ్రీకాంత్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు, నావికాదళ సైనికులు పాల్గొన్నారు.