Video : అందరికీ బస్ టికెట్ కొనేన్ని డబ్బులు నా దగ్గరలేవన్న నారాలోకేష్
మంగళగిరి బస్టాండ్ వద్ద లోకేష్ నేతృత్వంలో టీడీపీ ఎమ్మెల్సీలు నిరసన బాట పట్టారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
మంగళగిరి బస్టాండ్ వద్ద లోకేష్ నేతృత్వంలో టీడీపీ ఎమ్మెల్సీలు నిరసన బాట పట్టారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. మంగళగిరి నుండి అసెంబ్లీ వరకూ లోకేష్, ఇతర టిడిపి ఎమ్మెల్సీలు బస్ లో ప్రయాణించారు. పెంచిన ఆర్టీసీ రేట్లు తగ్గించే వరకూ పోరాటం చేస్తాం. పెంచుకుంటూ పోతాం అని జగన్ గారు అంటే అందరూ సంక్షేమ కార్యక్రమాలు పెంచుతారు అనుకున్నారు కానీ జగన్ గారు ఇసుక ధర, ఆర్టీసీ ధరలు పెంచుకుంటూ పోతున్నారు త్వరలో విద్యుత్ ఛార్జీలు కూడా పెంచేస్తారంటూ నారా లోకేష్ విమర్శించారు.