Asianet News TeluguAsianet News Telugu

సునామీలా దూసుకొస్తూ... 100మందిలో 24మందికి వైరస్: లోకేష్ ఆందోళన

క‌రోనా సెకండ్ వేవ్ లో ప్ర‌స్తుత ప‌రిస్థితులు, ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే ఎదుర‌య్యే ప‌రిణామాల‌పై గురువారం విద్యార్థులు, త‌ల్లిదండ్రులు, విద్యావేత్త‌లు, న్యాయ‌ నిపుణులు, విద్యార్థి సంఘ నేత‌ల‌తో టౌన్‌హాల్ స‌మావేశం జూమ్‌లో నిర్వ‌హించారు లోకేష్.

క‌రోనా సెకండ్ వేవ్ లో ప్ర‌స్తుత ప‌రిస్థితులు, ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే ఎదుర‌య్యే ప‌రిణామాల‌పై గురువారం విద్యార్థులు, త‌ల్లిదండ్రులు, విద్యావేత్త‌లు, న్యాయ‌ నిపుణులు, విద్యార్థి సంఘ నేత‌ల‌తో టౌన్‌హాల్ స‌మావేశం జూమ్‌లో నిర్వ‌హించారు లోకేష్. ఈ సంద‌ర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ... కోవిడ్‌19 వైర‌స్‌ ఫస్ట్ వేవ్ కంటే, సెకండ్‌వేవ్‌ బాధితుల్లో చిన్నారులు, విద్యార్థులు ఎక్కువ‌గా ఉండ‌టం తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తోంద‌న్నారు. రాష్ట్రంలోని చిన్నపిల్లల వైద్యుల దగ్గరకు వస్తున్న కేసుల్లో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంద‌న్నారు. మన రాష్ట్రంలో 24 శాతం పాజిటివిటీ రేట్ ఉంద‌ని,  అంటే ప్రతి వంద మందిలో 24 మందికి వైరస్ సోకుతోంద‌ని వెల్ల‌డి కావ‌డం ప‌రిస్థితి తీవ్ర‌త‌కు అద్దం పడుతోంద‌న్నారు.