చంద్రబాబును చూసి జగన్ కు కిందనుండి కారుతోంది..: నక్కా ఆనంద్ బాబు

గుంటూరు : చంద్రబాబు నాయుడు పర్యటనలకు వస్తున్న స్పందన, ప్రజా వెల్లువను చూసి జగన్ వెన్నులో వణుకు పుడుతోందని... 

First Published Jan 5, 2023, 1:45 PM IST | Last Updated Jan 5, 2023, 1:45 PM IST

గుంటూరు : చంద్రబాబు నాయుడు పర్యటనలకు వస్తున్న స్పందన, ప్రజా వెల్లువను చూసి జగన్ వెన్నులో వణుకు పుడుతోందని... భయపడిపోతూ కిందనుండి కారుతున్నట్లుంది అంటూ మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. మహనీయుడు బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని జగన్ నిట్టనిలువునా పాతరేస్తూ చీప్ పాలిటిక్స్ చేస్తున్నాడని అన్నారు. చీకటి జీవో 01 ద్వారా ప్రతిపక్షాలు రోడ్ షో లు, సభలు, సమావేశాలు చేస్తూ ప్రజల్లోకి వెళ్లకుండా చేయాలన్నదే జగన్ కుట్రగా కనిపిస్తోందని అన్నారు.  భారతదేశంలోని ఏ ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డిలా భయపడటం లేదన్నారు. బ్రిటీష్ కాలం నాటి 1861 పోలీస్ యాక్ట్ ను రాష్ట్రంలో అమలు చేసాడంటేనే జగన్ ఏ స్థాయిలో వుందో అర్థమవుతుందని ఆనంద్ బాబు పేర్కొన్నారు. 
 కుప్పంలో చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకోవడం, పార్టీ శ్రేణులపై లాఠీ చార్జ్ ఘటనలకు నిరసనగా నేడు టిడిపి ఆందోళనకు పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు ముందస్తుగానే టిడిపి నాయకులను హౌస్ అరెస్టులు చేసారు. ఇలా ఆనంద్ బాబును కూడా ఇంట్లోంచి బయటకు రానివ్వకుండా అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులతో వాగ్వాదానికి దిగిన మాజీ మంత్రి అనుచరులతో కలిసి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. జీవో నెం1 ప్రతులను అంబేద్కర్ విగ్రహం ఎదుటే తగలబెట్టారు ఆనంద్ బాబు.