కన్న కూతురిని కిడ్నాప్ చేసి... లాడ్జ్ లో వుంచి...

విజయవాడ: తూర్పు గోదావరి జిల్లాలో కలకలం రేపిన మైనర్ బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. 

First Published Dec 15, 2020, 5:01 PM IST | Last Updated Dec 15, 2020, 5:01 PM IST

విజయవాడ: తూర్పు గోదావరి జిల్లాలో కలకలం రేపిన మైనర్ బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. అయినవిల్లి మండలం శానపల్లి లంకలో సోమవారం రాత్రి 11 గంటలకు అదృశ్యమైన గుర్రాల సంయుక్త(13) జాడను పోలీసులు గుర్తించారు. తాతయ్య వద్ద వుంటున్న బాలికను కన్న తల్లే కిడ్నాప్ చేసి తీసుకెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో చిన్నారిని వున్నట్లు తెలుసుకుని అక్కడి పోలీసుల సాయంతో బాలికను కాపాడారు.  తల్లిదండ్రులు గొడవపడి వేరుగా వుంటుండటంతో కొద్దిరోజులుగా బాలిక తాత దగ్గర వుంటోంది. సోమవారం ఇంటి వద్ద ఆడుకుంటూ ఒక్కసారిగా బాలిక కనిపించకుండా పోయింది. విషయాన్ని గుర్తించిన బాలిక తాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాలిక జాడను గుర్తించి తిరిగి తాత వద్దకు చేర్చారు.