Video news : చెప్పులు విసిరితే మంత్రులు సంతోషించారు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి యాత్రలో జరిగిన నిరసనల మీద ఆ పార్టీ నాయకులు నిరసనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి యాత్రలో జరిగిన నిరసనల మీద ఆ పార్టీ నాయకులు నిరసనలు తెలిపారు. గుంటూరు జిల్లా తూళ్లూరు పేటలో Mlc అశోక్ బాబు, ఎమ్యెల్యే నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. పోలీస్ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది అందుకే ఇక్కడే ఫిర్యాదు చేస్తున్నాంఅని అశోక్ బాబు అన్నారు. ప్రతిపక్ష నేత ఉన్న బస్ పై చెప్పులు, రాళ్లు, కర్రలు విసిరారు. 14 ఏళ్ల సీఎంగా చేసిన అనుభవం, 25 ఏళ్ల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి పై చెప్పులు విసిరితే మంత్రులు సంతోషించారంటూ నిమ్మల రామానాయుడు విరుచుకుపడ్డారు.