ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య... సజ్జల డైరెక్షన్ లోనే నాటకం: మాజీ మంత్రి బండారు సంచలనం
కాకినాడ: వైసిపి ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ (అనంత బాబు) మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య, అనంతరం జరుగుతున్న పరిణామాలపై మాజీ మంత్రి, టిడిపి నాయకులు బండారు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేసారు.
కాకినాడ: వైసిపి ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ (అనంత బాబు) మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య, అనంతరం జరుగుతున్న పరిణామాలపై మాజీ మంత్రి, టిడిపి నాయకులు బండారు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల డైరెక్షన్ లో ఈ నాటకం జరుగుతోంని... ఎమ్మెల్సీ అనంతబాబును రహస్య ప్రాంతంలో ఉంచి డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దావోస్ లో ఉండి సజ్జలతో ఈ వ్యవహారం నడిపిస్తున్నారని అన్నారు. ఏం మాట్లాడలేని మహిళను హోంమంత్రిగా వుంచి అన్నీ సజ్జలే నడిపిస్తున్నారని... ఇప్పటికే పోలీస్ రక్షణలో ఆనంతబాబు ఉన్నాడని బండారు సత్యనారాయణ ఆరోపించారు.