సోషల్ మీడియాలో వికలాంగ బాలిక ఆవేధన... గొప్పమనసు చాటుకున్న మంత్రి

అమరావతి: తన కుటుంబానికి చెందిన భూమిని కొందరు ఆక్రమించుకున్నారని...

First Published Dec 18, 2020, 12:56 PM IST | Last Updated Dec 18, 2020, 12:56 PM IST

అమరావతి: తన కుటుంబానికి చెందిన భూమిని కొందరు ఆక్రమించుకున్నారని...కబ్జాకోరులు నుంచి విడిపించి తన కుటుంబాన్ని ఆదుకోమంటూ ఓ దివ్యాంగురాలి సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఆమె ఆవేదనతో సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వైరల్ గా మారి చివరకు దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దాకా వెళ్లింది. దీంతో వెంటనే స్పందించిన మంత్రి బాలిక మౌనికతో పాటు బాధిత కుటుంబం మొత్తాన్ని క్యాంప్ కార్యాలయానికి పిలిపించారు. వారి సమస్య ఏమిటో తెలుసుకున్న మంత్రి బాధిత కుంటుంబానికి తగిన న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఇలా ఓ దివ్యాంగురాలి ఆవేదనను అర్థం చేసుకుని న్యాయం చేయడానికి ముందుకొచ్చిన మంత్రిపై ప్రశంసలు కురుస్తున్నాయి.