వెంకటపాలెం వెంకన్న సన్నిధిలో మంత్రి రోజా దంపతులు...

గుంటూరు : ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా దంపతులు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కలియుగదైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

First Published Jan 2, 2023, 3:55 PM IST | Last Updated Jan 2, 2023, 3:55 PM IST

గుంటూరు : ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా దంపతులు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కలియుగదైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వెంకటపాలెంకు భర్త సెల్వమణితో కలిసి వెళ్లారు రోజా. ఆలయానికి చేరుకున్న మంత్రి దంపతులకు ఆలయ అర్చకులు స్వాగతం పలికి దగ్గరుండి స్వామివారి దర్శనం చేయించారు. రోజా, సెల్వమణి దంపతులతో పాటు వారి పిల్లల పేరిట స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు తీర్థప్రసాదాలు అందించి వేదాశీర్వచనం అందించారు.  ఇక వైసిపి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా వెంకటపాలెం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకునేందుకు తరలిరావడంతో ఆలయంలో కోలాహలం నెలకొంది. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసారు.