బోడిలింగం ఎవరో... గాజువాక, భీమవరం ప్రజలకు తెలుసు: పవన్ పై కొడాలి నాని ఫైర్
అమరావతి: నివర్ తుఫాను బాధిత రైతులను పరామర్శించేందుకు కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటిస్తూ మంత్రి కొడాలి నానిపై పవన్ కల్యాణ్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
అమరావతి: నివర్ తుఫాను బాధిత రైతులను పరామర్శించేందుకు కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటిస్తూ మంత్రి కొడాలి నానిపై పవన్ కల్యాణ్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ మంత్రి నాని తనదైన స్టైల్లో కౌంటరిచ్చారు. ఎవరో వచ్చి ఏదేదో అడిగితే తాము సమాధానం చెప్పబోమన్నారు. పవన్ కల్యాణ్ బోడి లింగం కాబట్టే ప్రజలు కింద పడేశారన్నారు. బోడిలింగం ఎవరో గాజువాక, భీమవరం ప్రజలకు తెలుసన్నారు. పవన్ ను సినిమాలు మానేయలని ఎవరైనా అడిగారా...? అని నాని ప్రశ్నించారు.