Asianet News TeluguAsianet News Telugu

సాంకేతిక వ్యవసాయం...సహాయం చేయండి: జర్మనీ కాన్సులేట్ అధికారులతో కన్నబాబు

విజయవాడ: జర్మనీ కన్సులెట్ అధికారులు కరిన్ స్టోల్, ఖ్రిస్తియనా హిరౌన్నముస్, డాక్టర్ క్రిస్తోపే కేస్లార్ లు ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబుతో సమావేశమయ్యారు. 

విజయవాడ: జర్మనీ కన్సులెట్ అధికారులు కరిన్ స్టోల్, ఖ్రిస్తియనా హిరౌన్నముస్, డాక్టర్ క్రిస్తోపే కేస్లార్ లు ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబుతో సమావేశమయ్యారు. రాష్ర్టంలో ప్రజల ఆరోగ్యం వ్యవసాయ పద్ధతుల మీద ఆధార పడుతుందని... జీరో లేదా తక్కువ రసాయనాలు వినియోగించేలా నూతన సేంద్రియ వ్యవసాయ విధానాన్ని అమలు చేయనున్నామని మంత్రి వాళ్ళతో చెప్పారు. రైతు సంక్షేమం లో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రైతుల ఆర్థిక ప్రయోజనాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను వైసిపి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. విత్తు నుంచి విక్రయం వరకూ ప్రతి సందర్భంలో ప్రభుత్వం రైతులకు సహాయంగా వుంటుందన్నారు. పెట్టుబడులు, సాంకేతిక విజ్ఞానం తదితర అంశాల్లో జర్మనీ ఇతోధికంగా సహాయం చేయాలని మంత్రి కన్నబాబు జర్మనీ అధికారులతో కోరారు.