చంద్రబాబు రక్తదాహమే ఆ నిర్ణయానికి కారణం..: మంత్రి అమర్నాథ్ సంచలనం

విశాఖపట్నం : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన హత్యలు, రక్త దాహం వల్లే రోడ్లపై బహిరంగ సభలు జరపకూడదని ప్రభుత్వం జీవోలు తీసుకురావాల్సి వచ్చిందని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.

First Published Jan 8, 2023, 11:41 AM IST | Last Updated Jan 8, 2023, 11:41 AM IST

విశాఖపట్నం : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన హత్యలు, రక్త దాహం వల్లే రోడ్లపై బహిరంగ సభలు జరపకూడదని ప్రభుత్వం జీవోలు తీసుకురావాల్సి వచ్చిందని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. కందుకూరు, గుంటూరులో తొక్కిసలాటలకు చంద్రబాబే కారణమని... ఆ రక్తపు మరకలు చెరపడానికే ఈ జీవోలు తీసుకువచ్చామన్నారు. ప్రజల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. 

పెద్ద గ్రౌండ్ లో ఎవరికీ ఇబ్బంది లేకుండా, ఎవరికీ అపాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకుని సభలు, సమావేశాలు జరపడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని అమర్నాథ్ అన్నారు.  
జనం వచ్చినా రాకున్నా నిన్న బాలకృష్ణ సినిమా ఈవెంట్ కు అనుమతిచ్చామని అన్నారు. ఇలా అన్ని అనుమతులతో సభలు, సమావేశాలు జరుపుకోడానికి ప్రభుత్వానికి అభ్యంతరమేమీ వుండదని మంత్రి అమర్నాథ్ అన్నారు.