గ్లోబర్ ఇన్వెస్టర్ సమ్మిట్ కు జోరుగా ఏర్పాట్లు... పరిశీలించిన పరిశ్రమల మంత్రి
విశాఖపట్నం : వచ్చే నెల మార్చి 3, 4 తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం విశాఖపట్నంలో ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి.
విశాఖపట్నం : వచ్చే నెల మార్చి 3, 4 తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం విశాఖపట్నంలో ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇవాళ ఈ ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు కేంద్ర , రాష్ట్ర మంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొనే ఈ సమ్మిట్ లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సదుపాయల కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో 25 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొననున్నారని అన్నారు. ఏపీ రాష్ట్రం పెట్టుబడులకు ఎలా అనువైనదో ఈ సమ్మిట్ ద్వారా వ్యాపారవేత్తలకు తెలియజేయనున్నట్లు మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు.