చంద్రబాబు మహాప్రస్థానం వాహనాలు కొంటే.. జగన్ అంబులెన్సులు కొన్నాడు... అవంతి

అత్యున్నత ప్రమాణాలు, అత్యాధునిక సౌకర్యాతో రూపొందించిన 108, 104 వాహనాలను విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. 

First Published Jul 2, 2020, 5:49 PM IST | Last Updated Jul 2, 2020, 5:49 PM IST

అత్యున్నత ప్రమాణాలు, అత్యాధునిక సౌకర్యాతో రూపొందించిన 108, 104 వాహనాలను విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. విశాఖకు మొత్తం 67 వాహనాలు వచ్చాయని అందులో 42 108 వాహనాలని తెలిపారు. చంద్రబాబు హయాంలో మహాప్రస్థానం వాహనాలను కొనుగోలు చేశారని, అదే జగన్ ప్రజల ప్రాణాలను కాపాడే అంబులెన్సులను కొనుగోలు చేశారని అన్నారు. చంద్రబాబు ప్రజల ప్రాణాలు పోయాక స్మశానానికి పంపే ఏర్పాటు చూస్తే.. జగన్ ప్రజల ప్రాణాలు కాపాడడానికి చర్యలు తీసుకుంటున్నారని ఇద్దరికీ అదే తేడా అని అన్నారు.