Asianet News TeluguAsianet News Telugu

వైసిపిలో చేరడానికి గంటా గట్టి ప్రయత్నాలు... కానీ...: అవంతి శ్రీనివాస్ (వీడియో)

సిఐడీ దర్యాప్తుకి ప్రభుత్వానికి ముడి పెడుతున్న టిడిపి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కి వైసీపీ ఘాటుగా కౌంటర్ ఇస్తోంది. గంటా శ్రీనివాసరావు సంవత్సర రోజులు వైసిపీలో చేరడానికి ప్రయత్నించారని...దారులన్ని మూసివేయడంతో ఇప్పుడు బురద జల్లుతున్నారని మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆరోపించారు. 

విశాఖపట్నం: సిఐడీ దర్యాప్తుకి ప్రభుత్వానికి ముడి పెడుతున్న టిడిపి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కి వైసీపీ ఘాటుగా కౌంటర్ ఇస్తోంది. గంటా శ్రీనివాసరావు సంవత్సర రోజులు వైసిపీలో చేరడానికి ప్రయత్నించారని...దారులన్ని మూసివేయడంతో ఇప్పుడు బురద జల్లుతున్నారని మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆరోపించారు. ఎవ్వరిని అన్యాయంగా అరెస్ట్ చేయలేదని, పూర్తి ఆధారాలతో అరెస్ట్ చేశారని చెప్పారు. సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం పై విమర్శలు చేస్తే ఎవరికైనా విచారణ తప్పదని స్పష్టం చేసిన ఆయన తప్పుడు ప్రచారాలు చేసి నాయకుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదని చెప్పారు. నాయకులపై అసత్య ప్రచారాలు చేస్తే ప్రభుత్వం తప్పనిసరిగా చర్యలు తీసుకుంటుందని అన్నారు. గత ప్రభుత్వ హాయంలో సిబిఐకి నో చెప్పిన నేతలే ఇప్పుడు అదే సిబిఐ ఉచ్చులో పడడం ఆశ్చర్యకంగా మారిందని అవంతి శ్రీనివాస్ రావు అన్నారు.