నాకు ఏ నానీ తెలీదు... కొడాలి నాని కాకుండా..: మంత్రి అనిల్ యాదవ్

అమరావతి: థియేటర్లలో టికెట్ ధరల విషయంలో జగన్ సర్కార్ చర్యలను తప్పుబడుతూ హీరో నాని చేసిన వ్యాఖ్యలపై ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగా స్పందించారు. సినిమాల పేరిట జరిగే దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే సినిమాల్లో యాక్ట్ చేసే హీరోలకి ఎందుకు అంత కడుపుమంట అని మండిపడ్డారు. తమకు ఏ నానీలు తెలియదని... తెలిసిందల్లా కేవలం కొడాలి నాని అన్న ఒకడేనని అనిల్ పేర్కొన్నారు. చాలా సినిమాలకు ప్రొడక్షన్ కి కేవలం 30శాతం ఖర్చు అయితే హీరోల రెమ్యునరేషన్ కే 70  శాతం ఖర్చవుతోంది. నిజంగానే టాలీవుడ్ బాగు కోరుకునేవాళ్లే అయితే హీరోలు తమ రెమ్యునిరేషన్ తగ్గించుకోవచ్చు కదా...? అని మంత్రి అనిల్ సూచించారు.

First Published Dec 24, 2021, 4:13 PM IST | Last Updated Dec 24, 2021, 4:13 PM IST