జలవనరుల శాఖ మంత్రిగా మొదటిసారి... అంబటి రాంబాబు పోలవరం సందర్శన
పోలవరం: ఆంధ్ర ప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శిస్తున్నారు అంబటి రాంబాబు.
పోలవరం: ఆంధ్ర ప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శిస్తున్నారు అంబటి రాంబాబు. ఉదయమే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతానికి చేరుకున్న మంత్రి స్పిల్ వే పై ఏర్పాటుచేసిన గ్యాలరీలో ఫొటో ఎగ్జిబిషన్ ను పరిశీలించారు. మంత్రి వెంట పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ యం.వి.ఎస్.నాగిరెడ్డి, జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఆర్డీవో ఝాన్సి రాణీ తదితరులు పాల్గొన్నారు.