జనసేన రాజకీయ పార్టే కాదు... రౌడీలు, సంఘవిద్రోహ శక్తుల పార్టీ : అంబటి సంచలనం

పల్నాడు : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ మంత్రి అంబటి రాంబాబును అడ్డుకోడానికి జనసైనికులు సిద్దమవడంతో పల్నాడు జిల్లాలో టెన్షన్ కు దారితీసింది.

First Published Jan 10, 2023, 11:33 AM IST | Last Updated Jan 10, 2023, 11:33 AM IST

పల్నాడు : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ మంత్రి అంబటి రాంబాబును అడ్డుకోడానికి జనసైనికులు సిద్దమవడంతో పల్నాడు జిల్లాలో టెన్షన్ కు దారితీసింది. సోమవారం సాయంత్రం దాచేపల్లిలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో మంత్రి రాంబాబు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయనను జనసేన నాయకులు అడ్డుకునే అవకాశం వుందన్న ముందస్తు సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పట్టణంలోని జనసేన కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మొహరించారు. పార్టీ కార్యాలయంలోకి పోలీసులు రావడంతో ఆగ్రహించిన జనసైనికులు అద్దంకి - నార్కట్ పల్లి హైవే పై బైఠాయించి ఆందోళన చేపట్టారు. 

ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ... పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు కొత్తగా కలవడం కాదు ఎప్పుడూ కలిసే వున్నారని అన్నారు. దాచేపల్లి అభివృద్ది కార్యక్రమాలను అడ్డుకోవాలని చూస్తున్నారంటే వీరు జన సైనికులా, రౌడీ సైనికులా అని ఎద్దేవా చేసారు. అసలు జనసేన రాజకీయ పార్టీయే కాదు... జనసైనికులు సంఘవిద్రోహ శక్తులంటూ మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు చేసారు.