దాచేపల్లిలో దారుణం... మైనింగ్ ట్రాక్టర్ ఢీకొని హాస్పిటల్ పాలైన విద్యార్థి

గుంటూరు: స్కూల్ కు వెళుతుండగా మైనింగ్ ట్రాక్టర్ ఢీకొని ఓ విద్యార్థి హాస్పిటల్ పాలయిన దుర్ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. దాచేపల్లిలోని మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న నాగరాజు అనే విద్యార్థి బైక్ పై స్కూల్ కు వెళుతుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ విద్యార్థిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు. అయితే తోటి విద్యార్థి రోడ్డు ప్రమాదానికి గురయినట్లు తెలిసిన మిగతా విద్యార్థులు ఆందోళనకు దిగారు. నిత్యం విద్యార్థులు తిరుగుతుండే స్కూల్ వద్ద మైనింగ్ ట్రాక్టర్ల బెడద ఎక్కువయ్యిందని... దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోతున్నారు. అధికారపార్టీ నేత కనుసన్నల్లో మైనింగ్ కార్యకలాపాలు సాగుతుండటంతో అధికారులు పట్టించుకోవడం లేదని... దీంతో విద్యార్థులు ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని దాచేపల్లి వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

First Published Jan 17, 2022, 2:10 PM IST | Last Updated Jan 17, 2022, 2:10 PM IST