టిడిపిలో చేరతారంటూ ప్రచారం... పార్టీ మార్పుపై మాజీ హోంమంత్రి క్లారిటీ
గుంటూరు : అధికార వైసిపికి రాజీనామా చేసి టిడిపిలో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత క్లారిటీ ఇచ్చారు.
గుంటూరు : అధికార వైసిపికి రాజీనామా చేసి టిడిపిలో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత క్లారిటీ ఇచ్చారు. పార్టీ మారుతున్నట్లు జరుగుతున్నది తప్పుడు ప్రచారమని... తాను రాజకీయాల్లో వున్నంతకాలం వైసిపిలోనే వుంటానని అన్నారు. రాజకీయాలకు దూరమై ఇంట్లో వుంటాను కాని పార్టీ మారబోనని స్పష్టం చేసారు. తమ కుటుంబమంతా ఒకే పార్టీలో ఉండాలన్నదే తన అభిమతమని... అదే చెబితే తప్పుగా అర్థం చేసుకుని పార్టీ మారతానని వార్తలు రాసారని అన్నారు. నా భర్త ఓ పార్టీలో, తాను ఓ పార్టీలో, తమ పిల్లలు వేరో పార్టీలో ఉండబోమనే చెప్పానని... అందరం వైసిపిలోనే వుంటామని సుచరిత స్పష్టం చేసారు.