Video : బాలికపై భర్త అత్యాచారం, సహకరించిన భార్య
తాడేపల్లి, కొలనుకొండలో ఉర్దూలో హోమ్ ట్యూషన్ పాఠాలు చెప్పే పదిహేడేళ్ల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన ఖాశీం అత్యాచారం చేశాడు.
తాడేపల్లి, కొలనుకొండలో ఉర్దూలో హోమ్ ట్యూషన్ పాఠాలు చెప్పే పదిహేడేళ్ల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన ఖాశీం అత్యాచారం చేశాడు. పాఠాలు చెప్పేందుకు ఇంటికి వచ్చిన బాలికకు మాయమాటలు చెప్పి కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి అదే గ్రామానికి చెందిన సయ్యద్ ఖాసీంవలి అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకి పొక్కటంతో మత పెద్దలతో రాజీ అనంతరం బాలికను గుంటూరు జిల్లా ఎడ్లపాడు హాస్టల్ కు తరలించారు. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత ఖాసీం తన భార్య సహకారంతో బాలికను మరల ఇంటికి పిలిపించాడు. మూడు రోజులుగా బాలికను తన నివాసంలో బంధించి భార్య సహకరంతోనే అత్యాచారానికి పాల్పడ్డాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు తాడేపల్లి పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు.