ఏలూరులో సైకో భర్త కిరాతకం... భార్య న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి, చివరకు చంపేసాడు

ఏలూరు : ప్రేమించి పెళ్లాడిన వాడే ఆమె పాలిట యముడయ్యాడు. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న భర్త సైకోలా వ్యవహరిస్తూ చివరకు ఆమె ప్రాణాలను బలితీసుకున్నాడు.

First Published Feb 10, 2023, 10:35 AM IST | Last Updated Feb 10, 2023, 11:06 AM IST

ఏలూరు : ప్రేమించి పెళ్లాడిన వాడే ఆమె పాలిట యముడయ్యాడు. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న భర్త సైకోలా వ్యవహరిస్తూ చివరకు ఆమె ప్రాణాలను బలితీసుకున్నాడు. దీంతో వారి ఇద్దరు పిల్లలు అనాధలుగా మారాయి. ఈ అమానుష ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబం కధనం ప్రకారం... ముసునూరు మండలం రమణక్కపేట ఎస్సీ కాలనీలో జ్యోత్స్న-షేక్ నాగుల్ మీరా నివాసముండేవారు. వీరికి  షేక్ వసీమ్, షేక్ వాజిజ్ సంతానం. ప్రేమించి పెళ్లాడిన భార్యపై అనుమానం పెంచుకున్న నాగుల్ మీరా దారుణానికి ఒడిగట్టాడు. గతంలో భార్య ఫోటోను అసభ్యంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు ఈ సైకో భర్త. దీంతో ఇక నాగుల్ చేష్టలు భరించలేక జ్యోత్స్న పోలీస్ కేసు పెట్టి దూరంగా వుంటోంది. ఇలా గత రెండుమూడు నెలలుగా తనకు దూరంగా పిల్లలతో కలిసి వుంటున్న భార్యపై మరింత అనుమానం పెంచుకున్నాడు నాగుల్. ఈ క్రమంలో గురువారం రాత్రి భార్య ఇంటికి వెళ్లి పిల్లల ముందే కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో రక్తపుమడుగులో పడిపోయిన జ్యోత్స్న ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి చిన్నారులను అడిగి ఏం జరిగిందో తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.