కరోనా కలకలం.. మహానంది ఆలయం లో ముగ్గురికి పాజిటివ్
మహానందిలో కరోనా కలకలం సృష్టించింది.
మహానందిలో కరోనా కలకలం సృష్టించింది. 26 వరకు ఆలయం మూసివేస్తున్నట్లుగా దేవస్థానం అధికారులు ప్రకటించారు. మహానంది దేవాలయంలోని ఉద్యోగులు గత కొన్ని రోజులుగా కరోనా లక్షణాలతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అధికారులు వీరికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ముగ్గురికి కరోనా పాజిటివ్ గా తేలింది. కరోనా పాజిటివ్ గా వచ్చిన ముగ్గురు ఉద్యోగులను ఆసుపత్రికి తరలించారు. దేవాలయాన్ని శానిటైజ్ చేస్తున్నారు.