విశాఖలో ఘోర రోడ్డుప్రమాదం... అమాంతం గాల్లోకిఎగిరి కాలువలోకి దూసుకెళ్ళిన కంటైనర్
విశాఖపట్నంలోని కూర్మన్నపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
విశాఖపట్నంలోని కూర్మన్నపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనకాపల్లి నుండి వైజాగ్ వస్తుండగా ఓ కంటైనర్ రామచంద్ర హోటల్ సమీపానికి రాగానే అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యింది. వేగంగా వెళుతూ అదుపుతప్పిన కంటైనర్ లారీ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం నుండి డ్రైవర్ తో పాటు క్లీనర్ తృటితో తప్పించుకున్నారు. వీరిద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు.