శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం వద్ద చిరుత హల్ చల్... సిబ్బంది భయాందోళన
కర్నూలు: శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం వద్ద ఆదివారం అర్ధరాత్రి చిరుతపులి హల్ చల్ చేసింది.
కర్నూలు: శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం వద్ద ఆదివారం అర్ధరాత్రి చిరుతపులి హల్ చల్ చేసింది. అర్ధరాత్రి విద్యుత్ కేంద్రం వద్దకు వచ్చిన చిరుత ఎస్పిఎప్ సిబ్బంది కంట పడింది. దీంతో నైట్ డ్యూటిలో ఉన్న విద్యుత్, సెక్యూరిటీ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. గతంలో కూడ పవర్ హౌస్ వద్ద రెండు సార్లు రెండు చిరుతపులులు సంచరించినట్లు సిబ్బంది చెబుతున్నారు.