భయం భయం... మహానంది మాఢవీధుల్లో చిరుత సంచారం (వీడియో)
రాయలసీమలోని ప్రముఖ హిందూ దేవాలయం మహానందిలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది.
కర్నూలు: రాయలసీమలోని ప్రముఖ హిందూ దేవాలయం మహానందిలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. ఈ ఆలయ మాఢ వీధుల్లో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. గోశాల సమీపంలో ఓ పందిని చంపిన చిరుత సమీపంలోని అడవుల్లోకి ఎత్తెకెళ్లినట్లు సమాచారం. భయాందోళనకు గురయిన గోశాలలో పనిచేసే ఆవుల కాపరులు అప్రమత్తమై ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో మహానందికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు చిరుత సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు.