కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ మరో సంచలనం.. శభాష్ అంటూ ప్రశంసలు..

కరోనా వైరస్ కు అందరూ భయపడుతున్నవేళ వైసీపీ కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అందరికీ ఆదర్శంగా నిలిచేపని చేశారు

First Published Aug 3, 2020, 5:16 PM IST | Last Updated Aug 3, 2020, 5:16 PM IST

కరోనా వైరస్ కు అందరూ భయపడుతున్నవేళ వైసీపీ కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అందరికీ ఆదర్శంగా నిలిచేపని చేశారు.  కర్నూలు పాతబస్తీకి చెందిన వ్యక్తి శుక్రవారం కరోనాతో స్థానిక పెద్దాసుపత్రిలో చనిపోయాడు. అతడికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులే ముందుకు రాకపోవడంతో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ స్వయంగా రంగంలోకి దిగారు. ఆసుపత్రి, మున్సిపల్‌ సిబ్బందితో కలిసి పీపీఈ కిట్లు ధరించి నగరంలోని సంతోష్‌నగర్‌ శ్మశాన వాటికలో సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిపించారు. వైరస్‌పై ప్రజల్లో ఉన్న భయాన్ని, అపోహలను తొలగించేందుకే తాను స్వయంగా అంత్యక్రియల్లో పాలుపంచుకున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. హఫీజ‌్‌ఖాన్‌పై నెటిజన్లు, స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.