Asianet News TeluguAsianet News Telugu

వలసకూలీలను బస్సుల్లో తరలిస్తున్న అధికారులు.. మేకతోటి సుచరిత చొరవతో...

హోంమంత్రి మేకతోటి సుచరిత చొరవతో కర్నూల్ జిల్లా నుండి గుంటూరు జిల్లాకు వచ్చిన వలస కూలీలు సొంత ఊర్లకు పయనమవుతున్నారు.

హోంమంత్రి మేకతోటి సుచరిత చొరవతో కర్నూల్ జిల్లా నుండి గుంటూరు జిల్లాకు వచ్చిన వలస కూలీలు సొంత ఊర్లకు పయనమవుతున్నారు. మిర్చి కూలీలు, ఇతర వలస కూలీలు లాక్ డౌన్ కారణంగా ఎక్కడికక్కడే ఉండిపోయారు. వారంతా హోంమంత్రితో వృద్ధులను, పిల్లలను సొంత ఊరిలో వదిలేసి వచ్చామని తమ గోడును చెప్పుకున్నారు. దీంతో వెంటనే స్పందించిన హోంమంత్రి  ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి వలస కూలీలను సొంత గ్రామాలకు పంపించేందుకు సన్నాహాలు చేశారు. కర్నూలు జిల్లాలోని గ్రీన్ జోన్ లో ఉన్న కూలీలను పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. కోసిగి, దేవరకొండ మండలాలకు చెందిన వలస కూలీల కోసం 8 బస్సులను ఏర్పాటు చేశారు. మల్లయపాలెం లో 9 బస్సులు, వంగిపురంలో 5, ప్రత్తిపాడులో  3, మేడవారి పాలెం లో 2 బస్సులను ఏర్పాట్లు చేశారు.