టిడిపికి షాక్ తప్పదా..! జగన్ హామీ ఇస్తే వైసిపిలో చేరతానంటున్న మాజీ ఎమ్మెల్యే
ఏలూరు : తెలుగుదేశం పార్టీని వీడేందుకు కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ సిద్దమైనట్లుగా ఆయన మాటలను బట్టి తెలుస్తోంది.
ఏలూరు : తెలుగుదేశం పార్టీని వీడేందుకు కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ సిద్దమైనట్లుగా ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. కొల్లేరు ప్రాంత సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళతానని... వాటి పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇస్తే వైసిపిలో చేరతానని అన్నారు. అయితే పార్టీ మార్పు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోనని... నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటానని అన్నారు. ప్రస్తుతానికి తాను టిడిపి ఇంచార్జిగా కొనసాగుతున్నానని... భవిష్యత్ రాజకీయాలను కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. ప్రస్తుతం టిడిపిలో గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయని... వీటిని పరిష్కరించేందుకు అదిష్టానం చర్యలేమీ తీసుకోకపోవడంతోనే పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్లు జయమంగళం తెలిపారు.