తాడిపత్రి ఉద్రిక్తం:జేసీ, ఎమ్మెల్యే కేతిరెడ్డి వర్గీయుల మధ్య పరస్పర రాళ్ల దాడి.... వాహనాలు, ఇండ్లు ధ్వంసం
తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వాహనాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు ధ్వంసం చేశారు.
తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వాహనాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు ధ్వంసం చేశారు.సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని కోపంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్లి ఇద్దరిపై దాడికి దిగారని టీడీపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు.ఈ సమయంలో జేసీ ఇంటి వద్ద ఉన్న టీడీపీ వర్గీయులతో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగి దాడికి దిగారు. ఈ ఘటన జరిగిన సమయంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో లేరు. ఈ విషయం తెలుసుకొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు అక్కడికి చేరుకొని పెద్దారెడ్డి వర్గీయులపై రాళ్లదాడికి దిగారు. ఇరువర్గాలు రాళ్లదాడి చేసుకొన్నారు. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన వాహనాలు ధ్వంసమయ్యాయి.