బీజేపీ తో బ్రేకప్, టీడీపీతో ప్యాచప్... జనసేనాని 2024 ఎన్నికల రూట్ మ్యాప్..!
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ రాష్ట్ర బిజెపి నాయకత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ రాష్ట్ర బిజెపి నాయకత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఒత్తిడి పెట్టే రాజకీయాలకు ఆయన తెర తీసినట్లు కనిపిస్తున్నారు. తనతో పొత్తు పెట్టుకోవాల్సిన అనివార్యత చంద్రబాబుకు ఉన్నదని ఆయన భావిస్తున్నారు. దీంతో పవన్ కల్యాణ్ చంద్రబాబు తనకు అనుకూలంగా వ్యవహరించేలా ఒత్తిడి పెడుతున్నట్లు అర్థమవుతోంది. అయితే, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై ఆయన ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు అర్థమవుతోంది.