''రా తరలి రా... యువశక్తి సభతో పవన్ కల్యాణ్ సమర శంఖం''

మంగళగిరి : వైసీపీ ప్రభుత్వం విధానాలతో యువత నిర్వీర్యం అవుతోందని... అందుకే యువతలో నూతనోత్తేజం తీసుకువచ్చేందుకే జనసేనాని పవన్ కల్యాణ్ ముందుకొచ్చారని జనసేన పార్టీ  మంగళగిరి ఇంఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు.
 

First Published Jan 8, 2023, 4:25 PM IST | Last Updated Jan 8, 2023, 4:25 PM IST

మంగళగిరి : వైసీపీ ప్రభుత్వం విధానాలతో యువత నిర్వీర్యం అవుతోందని... అందుకే యువతలో నూతనోత్తేజం తీసుకువచ్చేందుకే జనసేనాని పవన్ కల్యాణ్ ముందుకొచ్చారని జనసేన పార్టీ  మంగళగిరి ఇంఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. రాజకీయ వ్యవస్థను రాష్ట్ర సరిహద్దులు దాటించే సత్తా యువశక్తికే ఉందని... రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ యువశక్తితో పవన్ సమరానికి సన్నాహాలు ప్రారంభించారని అన్నారు. వైసిపి దుర్మార్గ, దాష్టిక పాలకుల మీద సమర శంఖం పూరించే సమయం ఆసన్నమైందని శ్రీనివాసరావు అన్నారు.  

శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం వేదికగా ఈ నెల 12న 'యువశక్తి' పేరుతో నిర్వహించనున్న జనసేన సభకు భారీగా తరలిరావాలని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. యువశక్తి విజయం.. యువత విజయం అవుతుందని... అందుకే ఈ సభకు యువత పెద్ద ఎత్తున తరలిరావాలని శ్రీనివాసరావు సూచించారు.