కనకదుర్గమ్మ వారధిపై జనసేన ప్లెక్సీలు తొలగింపు... నాదెండ్ల మనోహర్ సీరియస్

విజయవాడ: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు(సోమవారం) మంగ‌ళ‌గిరి మండ‌లం ఇప్ప‌టం గ్రామ ప‌రిధిలో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విజయవాడలోని కనకదుర్గమ్మ వారధి సమీపంలో జనసేన నాయకులు, కార్యకర్తలు రాత్రి ఫ్లెక్సీ లు ఏర్పాటుచేసారు. అయితే ఇవాళ ఉదయం ఆ ప్లెక్సీలను కార్పొరేషన్ సిబ్బంది తొలగించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనసేన ఫ్లెక్సీల తొలగింపుపై సమాచారం అందుకున్న పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అక్కడికి చేరుకుని సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేసారు. అధికార పార్టీ నేతలు కుట్ర రాజకీయాలు చేస్తూ ఆవిర్భావ సభకు ఆటంకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. జనసేన నేతలు, కార్యకర్తలు కూడా భారీగా చేరుకోవడంతో వారధిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది.
 
First Published Mar 13, 2022, 1:24 PM IST | Last Updated Mar 13, 2022, 1:24 PM IST