Asianet News TeluguAsianet News Telugu

పవన్ ఫ్యాన్స్ రూటే సెపరేటు... పవర్ స్టార్ నిలువెత్తు ఫోటోతో పెళ్ళి బ్యానర్

గుంటూరు : ఏ హీరో ప్యాన్స్ అయినా సినిమాల విడుదల సమయంలో థియేటర్ల వద్ద కటౌట్లు, ప్లెక్సీలు ఏర్పాటుచేసి తమ అభిమానాన్ని చాటుకుంటారు...

First Published Dec 15, 2022, 10:21 AM IST | Last Updated Dec 15, 2022, 10:21 AM IST

గుంటూరు : ఏ హీరో ప్యాన్స్ అయినా సినిమాల విడుదల సమయంలో థియేటర్ల వద్ద కటౌట్లు, ప్లెక్సీలు ఏర్పాటుచేసి తమ అభిమానాన్ని చాటుకుంటారు... కానీ పవన్ కల్యాణ్ ప్యాన్స్ రూటే సెపరేటు. ఈశ్వరా... పరమేశ్వరా... పవనేశ్వరా.. అంటూ తాము అభిమానించే పవన్ ను దేవుడిలా భావించే అభిమానులు వున్నారు. వీరు కేవలం పవన్ సినిమాల విడుదల సమయంలో మాత్రమే కాదు తమ ఇంట్లో ఫంక్షన్లకు కూడా పవర్ స్టార్ ప్లెక్సీలను ఏర్పాటుచేసి సందడి చేస్తుంటారు. ఇలా గుంటూరు జిల్లా తెనాలిలో ఓ వీరాభిమాని తన పెళ్లికి పవన్ నిలువెత్తు ప్లెక్సీ ఏర్పాటుచేసి అభిమానాన్ని చాటుకున్నాడు. 

తెనాలి బాలాజీరావు పేటకు చెందిన మాన్యం జగదీష్ పవన్ కల్యాణ్ వీరాభిమాని. ఇతడికి రమ్య అనే యువతితో వివాహం నిశ్చయమయ్యింది. అయితే తన అభిమాన హీరో పవన్ కల్యాణ్ సమక్షంలో పెళ్లి చేసుకోవాలని భావించిన అతడి అది సాధ్యంకాకపోవడంతో ఏకలవ్యుడి మాదిరిగా ఆయన ప్లెక్సీ ముందు పెళ్లి చేసుకున్నాడు. పవన్ కల్యాణ్ ఫోటోను వధూవరులతో కూడిన పెళ్లి బ్యానర్ లో వేయించి అభిమానాన్ని చాటుకున్నారు. పెళ్లి బ్యానర్ లో వధూవరుల మధ్య పవన్ ఫోటో చూసి ఆశ్చర్యపోవడం అతిధుల వంతయ్యింది.