ఖబర్దార్... జనసైనికుల జోలికి వస్తే చూస్తూ ఊరుకోం..: పోలీసుకులకు జనసేన నేత హెచ్చరిక
జనసైనికులపై అక్రమ కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకోమని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.
జనసైనికులపై అక్రమ కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకోమని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. వైస్సార్సీపీ పార్టీ దౌర్జన్యకండా మరీ పేట్రేగిపోతోందని... జనసేన నాయకులు, కార్యకర్తలపై పోలీసులను అడ్డుపెట్టుకుని విధిరౌడీల్లా ప్రవర్తిస్తున్నారని శ్రీనివాస్ మండిపడ్డారు.
గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు నీలం రాము, జిల్లా కార్యదర్శి చేబ్రోలు బొడయ్యని వైస్సార్సీపీ వార్డు మెంబర్లను పార్టీ మారమన్నారనే నెపంతో స్థానిక ఎస్సై రోశయ్య తీవ్ర దుర్భాషలాడుతూ అరెస్ట్ చేసినట్లు తెలిసి పార్టీ నాయకులతో కలసి శ్రీనివాస్ యాదవ్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అలాగే నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు చుండూరు పోలీస్టేషన్ కు భారీగా తరలి వచ్చారు. స్టేషన్ ముందే బైఠాయించి నిరసన తెలిపారు.