జనసేన ఆవిర్భావ దినోత్సవం... విశాఖలో ఘనంగా వేడుకలు, సేవా కార్యక్రమాలు
విశాఖపట్నం: జివిఎంసి 22వ వార్డు కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆద్వర్యంలో విశాఖపట్నంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
విశాఖపట్నం: జివిఎంసి 22వ వార్డు కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆద్వర్యంలో విశాఖపట్నంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని మద్దిలపాలెం పిఠాపురం కాలనీ కళాభారతి వద్ద పార్టీ జెండా ఎగరవేసారు జనసైనికులు. అనంతరం తొమ్మిది కేజీల కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఇక మెడీకవర్ ఆసుపత్రి సహకారంతో ఏర్పాటుచేసిన మెడికల్ క్యాంపును ప్రారంభించి ప్రజలకు ఈసీజీ, బిపి, షుగర్ వంటి పరీక్షలు జరిపారు.