జనసేన మంకుపట్టు పవన్ కళ్యాణ్ రాజకీయ కెరీర్ కే ప్రమాదం తెచ్చే అవకాశం ఉందా..?

తిరుపతి ఎంపీ  దుర్గాప్రసాద్ అకాల మరణంతో ఇప్పుడు ఆ స్థానానికి  అనివార్యమయింది. 

First Published Dec 24, 2020, 9:49 AM IST | Last Updated Dec 24, 2020, 9:49 AM IST

తిరుపతి ఎంపీ  దుర్గాప్రసాద్ అకాల మరణంతో ఇప్పుడు ఆ స్థానానికి  అనివార్యమయింది. తెలంగాణలోని దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచి మంచి జోరుమీదున్న బీజేపీ అక్కడ కూడా గెలిచి తమ సత్త చాటాలని చూస్తుంది. మరోపక్క వారి మిత్రపక్షం జనసేన సైతం ఆ సీటుపై పట్టుబడుతుండడంతో అక్కడ రాజకీయం రంజుగా మారింది. 
జీహెచ్ఎంసీలో బీజేపీతో కాంప్రమైజ్ అయిన జనసేనాని .. తమ పార్టీకి తిరుపతి ఎంపీ సీటు ఇవ్వాలని పట్టుబడుతుండడంతో ఈ చిక్కుముడి వీడడంలేదు. ప్రస్తుతం బిజెపి-జనసేన కూటమిలో ఈ పరిస్థితులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వారి పొత్తుకే ఈ ఎన్నిక ప్రశ్నార్థకంగా మారింది.