చిలకలూరిపేటలో విషాదం... గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి మృతి

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఇంటర్మీడియట్ విద్యార్థి గుండెపోటుతో మృతిచెందాడు.

First Published Mar 7, 2023, 1:08 PM IST | Last Updated Mar 7, 2023, 1:08 PM IST

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఇంటర్మీడియట్ విద్యార్థి గుండెపోటుతో మృతిచెందాడు. రాత్రి భోజనం చేసి నిద్రించిన 17 ఏళ్ల యువకుడు షేక్ ఫెరోజ్ ఒక్కసారిగా గుండెనొప్పికి గురయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు దగ్గర్లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించినా ఫలితం లేకుండా పోయింది. మార్గమధ్యలోనే యువకుడు మృతిచెందాడు. ఇటీవల కాలంలో చిన్నవయసులోనే గుండెపోటుకు గురవుతున్న వారిసంఖ్య ఎక్కువయ్యింది.తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా గుండెపోటు మరణాలు మరీ ఎక్కవయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు సిపిఆర్ పై ప్రత్యేక శిక్షణ ఇస్తుందంటేనే గుండెపోటు మరణాలు ఏ స్థాయిలో వున్నాయో అర్థం చేసుకోవచ్చు.